|
మంచి నీటి చేపలు, రొయ్యల పెంపకం
రాష్ట్రంలో వివిధ మంచినీటి సరస్సులు, చెరువులు చేపల పెంపకానికి అనువుగా ఉన్నాయి. చేపలే కాక, మంచినీటి చెరువుల్లో రొయ్యల పెంపకం కూడా జరుగుతోంది. రొయ్యల ఎగుమతి వలన మన రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. కొన్ని జాతీయం చేయబడిన బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు చేపలు, రొయ్యలు చెరువుల నిర్మాణానికి అవసరమైన దీర్ఘకాలిక రుణాలను అందచేస్తున్నాయి. స్వల్పకాలిక పంట రుణాలను కూడా ఇస్తున్నాయి. చిన్నకారు, సన్నకారు రైతులకు, జిల్లా గ్రామీణభివృద్ది సంస్థలు, ఫిష్ ఫార్మర్స్ డెవలప్ మెంట్ ఏజెన్సీలు, వెనుకబడిన జాతుల, తరగతుల సంస్థ కొంత పరిమితికి లోబడి చేపలు, రొయ్యల పెంపకానికి సబ్సిడీ, మార్జిన్ మనీలను అందజేస్తునాయి. ఇప్పుడు మంచినీటి రొయ్యల పెంపకానికి సముద్ర ఉత్పతుల ఎగుమతుల అభివృది సంస్ట్ట కూడా సబ్సిడీ ఇస్తుంది.
మంచి నీటి చేపల పెంపకంలో మన దేశపు బొచ్చె, రాగండి, ఎర్రమైల, ఇతర దేశపు రకా లైన సిల్వర్ కార్పు, గ్రాస్ కార్పు , బంగారు తీగ వంటి చేపలను, మిశ్రమ చేపల పెంపకం ద్వారా, శాస్ర్తీయ పద్దతుల్లో పెంచుతున్నారు. చేపల పెంపకంలో సేంద్రియ, రసాయానిక ఎరువులు, అనుబంధ ఆహారంగా నూనె తీసిన తవుడు, వేరుశెనగ చెక్కను వాడి అధికోత్పత్తి చేస్తున్నారు. 10 నుండి 12 నెలల పంట కాలంలో మంచి నీటి చేపలు సుమారు 1 నుండి 5 కిలోలు పెరిగి, ఎకరాకు 8౦౦ నుండి 4,౦౦౦ కిలోల దిగుబడిని సాధించవచ్చు.
శాస్త్రీయ మరియు అధినికరణ పద్దతిలో చేపల పెంపకం చేపట్టడం వలన ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా నిర్మించిన 80,౦౦౦ హెక్టర్ల చేపల చెరువుల నుంచి సంవత్సరానికి 7,౦౦,౦౦౦ టన్నుల మంచి నిటి చేపల ఉత్పత్తి జరుగుతున్నది. దీనితో పాటు సహజ వనరులైన నదులు, రిజర్వుయార్లు, సరస్సుల నుంచి మన రాష్ట్రంలో మొత్తం 4 లక్షల టన్నుల మంచి నీటి చేపల ఉత్పత్తి జరుగుతున్నది. ప్రస్తుతం ఈ విధంగా ఉత్పతి అయిన మంఛి నీటి చేపలను వెదురు లేక ప్లాస్టిక్ తో తయారుచేసిన బుట్టల్లో ఐస్ తో ప్యాకింగ్ చేసిన తరువాత లారీ మరియు రైళ్ళ ద్వారా పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు బీహార్ వంటి రాష్ట్రాలకు రవాణా చేసి మార్కెట్ చేస్తున్నారు. |
అనువైన చేపల చెరువులు:
సారవంతమైన నేలను చెరువు నిర్మాణానికి ఎన్నుకోవాలి. సాధారణంగా వ్యవసాయానికి యోగ్యమైన నేలలన్ని చేపల పెంపకానికి అనువైనవే. నేలకు నీటిని పట్టిఉంచే గుణం ఉండాలి. నల్ల రేగడి నేలలు, ఒండ్రు నేలలు, కొంత శాతం ఇసుక కలిసిన ఒండ్రు నేలలు, గరప నేలలు చేపలు పెంపకానికి మిక్కిలి అనుకూలమైనది.
చెరువుకు సంవత్సరం పొడవునా తగిన పరిమాణంలో నాణ్యత గల నీటిని అందించే జల వనరులుండాలి. అను భందాహారం, ఎరువులు మొదలైన వాటిని చెరువు దగ్గరకు రవాణా చేయడానికి, ఉత్పత్తి అయిన చేపలను మార్కెట్ కు చేర వేయడానికి, అన్ని కాలాల్లోను ఉపయోగపడే రహదారి సౌకర్యం ఉండాలి. తక్కువ ఖర్చుతో నీటి యాజమాన్యం చేయడానికి, దొంగతనాలు జరగకుండా విద్యుత్ సరఫరా ఉంటే మంచిది. తరచుగా వరదలకు, తుఫానులకు గురయ్యే ప్రాంతం కారాదు. చెరువుకు నీరు సరఫరా నీరు చేసే జల వనరులు అన్ని రకాల కాలుష్యాలకు దూరంగా ఉండాలి. |
 |
|
|
చేపల చెరువుల నిర్మాణం:
సమర్ధవంతమైన యాజమాన్యానికి, స్వయం సమృద్ధికి ఏ చేపల క్షేత్రమైనా మూడు విధాలయిన చేపల చెరువులను కలిగి ఉండాలి అవి:
- చేప నారు మడులు (నర్సరీ చెరువు): చిచ్చును చేప దశ నుండి చిరు చేప దశ వరకు పెంచడానికి
- చేప పిల్లలను సాదే చెరువులు (రేరింగ్ చెరువు): చిరు చేప దశ నుండి పెద్ద చేప పిల్ల దశవరకు పెంచడానికి
- పెద్ద చేపలను పెంచే చెరువులు (స్టాకింగ్ చెరువు) : పెద్ద చేప పిల్లల దశ నుండి మార్కెట్ సైజు వరకు పెంచడానికి ఇవి అవసరం
పెద్ద చేపలను పెంచే చెరువు నిర్మాణం:
స్టాకింగ్ చెరువు చేపల క్షేత్రంలో అతి ముఖ్యమైనది. ఈ చెరువును రెండు రకాలుగా నిర్మించవచ్చు.
- చెరువు నిర్మించాల్సిన ప్రదేశం చుట్టూరా ఒక ట్రెంచ్ త్రవ్వి వచ్చిన మట్టిని గట్ల నిర్మాణానికి ఉపయెగించడం, దీనినే ట్రెంచ్ పద్ధతి చెరువు అంటారు.
- చెరువు నిర్మించాల్సిన ప్రదేశం అంతా కొంత లోతున త్రవ్వి వచ్చిన మట్టితో చుట్టూ గట్లు నిర్మించడం, దీనినే ‘సాసర్’ పద్దతిలో చెరువు నిర్మించడం అంటారు.
ట్రెంచ్ పద్ధతి చెరువుకు నిర్మాణపు ఖర్చు తక్కువ. స్టాకింగ్ చెరువు 2 నుండి 10 ఎకరాల వరకు ఉండవచ్చు. రెండెకరాల కంటే చిన్న చెరువు లాభదాయకం కాదు. 10 ఎకరాల కంటే పెద్ద చెరువుల యాజమాన్యం కష్టం.
చేపల చెరువులు మూడు ముఖ్య భాగాలున్నాయి. అవి 1. చెరువు అడుగు భాగం 2, చెరువు గట్లు ౩. లోనికి నీరు తీసుకునే ద్వారం (ఇన్ లెట్), మురుగు నీటిని బయటకు పంపే ద్వారం (ఆవుట్ లెట్)
ట్రెంచ్ పద్ధతి చెరువుకు నిర్మాణపు ఖర్చు తక్కువ. స్టాకింగ్ చెరువు 2 నుండి 10 ఎకరాల వరకు ఉండవచ్చు. రెండెకరాల కంటే చిన్న చెరువు లాభదాయకం కాదు. 10 ఎకరాల కంటే పెద్ద చెరువుల యాజమాన్యం కష్టం.
చేపల చెరువులు మూడు ముఖ్య భాగాలున్నాయి. అవి 1. చెరువు అడుగు భాగం 2, చెరువు గట్లు ౩. లోనికి నీరు తీసుకునే ద్వారం (ఇన్ లెట్), మురుగు నీటిని బయటకు పంపే ద్వారం (ఆవుట్ లెట్)
చెరువు అడుగు భాగం:
చెరువు అడుగు భాగం ఎత్తు పల్లాలు లేకుండా సమతలంగా ఉండాలి. నీరు లోనికి తీసుకునే ద్వారం నుండి, బయటకు వెళ్ళే ద్వారం వరకు చెరువు అడుగు భాగం క్రమంగా ఏటవాలు కలిగి ఉండాలి. ఈ విధంగా ఉంటె పట్టుబడే సమయంలో చేపలన్నీ ఒకే ప్రదేశంలో చేరటం వలన పట్టుబడి తేలికవుతుంది.
చెరువు గట్లు:
చెరువు గట్లు చెరువులో చాలినంత ఎత్తులో 6 నుండి 8 అడుగుల నీటిని నిలవ వుంచడానికి తగనంత ఎత్తుగా, బలంగా ఉండాలి. గట్టు పై భాగం వాహనాలు తిరగడానికి విలయనంత వెడల్పుగా ఉండాలి. గాట్లను 1:5 లేక 1:2 నిష్పత్తి వాలులో నిర్మించవచ్చు. చెరువులో నీరు నిలిచే ఎత్తుకు పైన 2 అడుగులు మిగులు గట్టి (ప్రీ బోర్డు) ఉండాలి. గట్లు బయటి అంచున అధికాయాన్ని పొందడానికి అరటి, కొబ్బరి వంటి ఫల వృక్షాలను యూకలిప్టస్ చెట్లను పెంచ వచ్చు. గట్ల కోతను నివారించడానికి గట్లపై ఎంపిక చేసిన నేపియార్, పరగ్రాసు వంటి గడ్డి జాతి మొక్కలను పెంచవచ్చు.
నీటిని లోనికి తీసుకునే, మురుగు నీటిని బయటకు పంపే ద్వారాల అమరిక:
నీటిని లోనికి తీసుకునే ద్వారం చెరువుకు ఎగువ వైపున, మురుగు నీటిని బయటకు పంపే ద్వారం దిగువ వైపున నిర్మించాలి. గురుత్వాకర్షణ బలంతో నీటిని లోనికి తీసుకోవడానికి మురుగు నీటిని బయటకు పంపడానికి వీలుగా ఉంటె నిటి యాజమాన్యపు ఖర్చు చాల వరకు తగ్గుతుంది. నీటిని లోనికి తీసుకునే ద్వారం నిర్మాణంలోనే, మాంసాహార చేపలు, ఇతర కలుపు చేపలు రాకుండా నిరోదించడానికి జాలీల (మెస్) ఏర్పాటు ఉండాలి.
ఒకే వరసలో చెరువులను నిర్మించేటపుడు ఒక చెరువులో నుంచి, ఇంకొక చెరువు లోనికి నిటి సరఫరా కనెక్షన్ ఇవ్వకుండా ప్రతి చెరువుకు, ఇనలేట్, ఆవుట్ లెట్ లను వేర్యేరుగా చేయవచ్చు.
చేపల చెరువును నిర్మించే ముందు, మట్టిని మరియు నీటిని భూసార పరీక్షా కేంద్రంలో పరిక్ష చేయించి ఫలితాలను దగ్గరలోని మత్త్యశాస్త్ర నిపుణుడితో సంప్రదించాలి. |
|
చెరువుల యాజమాన్యం
 |
ఎ. పెంపకానికి చెరువును సిద్దపరచే విధానం:
చేప పిల్లలను విడుదల చేసే ముందు చెరువులోని నీటిని మొత్తం తీసివేసి చెరువును ఎండబెట్టాలి. మాంసాహార, కలుపు చేపలను పూర్తిగా నిర్మూలించాలి. చేప పిల్లలను విడుదల చేయడానికి వారం రోజుల ముందు మొదట విడత సున్నం, ఎరువు చల్లి నీరు వదలాలి. అనవసర జాతి చేపలు, మాంసాహార చేపలు లోనికి రాకుండా ఇన్ లెట్ మెస్ అమర్చాలి. చెరువులో 6 నుండి 8 అడుగుల లోతు వరకు నీటిని నింపాలి. చెరువులో నీరు మూడు అడుగుల కంటే తక్కువ వేడి ఎక్కడం, కలుపు మొక్కలు పెరగడం వంటి సమస్వలు తలెత్తుతాయ్. చేపలకు సహజ సిద్దంగా లభ్యమయ్యే ఆహార పరిమాణం తగ్గిపోతుంది. |
మంచి నిటి చేపలు, రొయ్యల మిశ్రమ పెంపక విధానం:
సాధారణంగా మంచి నీటిలో పెంచబడే ఇండియన్ మేజర్ కార్స్ జాతి చేపలు, బొచ్చ, రాగండి. మోసులతో పాటు యేటి రొయ్యలను (మాక్రోబ్రేఖియంమాల్యం సోని), నీల కంట రొయ్య (మాక్రోబ్రేఖియం రోజెన్ బెర్గి) పెంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ రొయ్యల విత్తనాన్ని కృష్ణ జిల్లాలోని ప్రకాశం బ్వారేజ్ , తూర్పు గోదావరి జిల్లా లోని ధవళేశ్వరం బ్వారేజ్ వద్ద సేకరించవచ్చు. కాకినాడలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి చెందిన మత్స్య విజ్ఞాన శాస్త్ర శాఖకు చెందిన హేచారిలోనూ, ఇతర ప్రైవేటు హేచరిలలోనూ నీలకంఠ రొయ్య విత్తనాన్ని ఉత్పత్తి విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నార
ప్రకృతిలో రొయ్య విత్తనాన్ని సేకరించినపుడు ఈ రెండు రకాల రొయ్య విత్తనాలతో పాటు, స్కెబ్రిక్యులమ్ (తెలు రొయ్య), లామేరై (గోంగూర రొయ్యల) ల వంటి అనవసర జాతి రొయ్యల విత్తనం కూడా కలిసి ఉంటుంది. రొయ్య పిల్ల రోష్ట్రం (ముక్కు) ఆకారాన్ని, పొడవును, దానిపై నున్న కంటకాల సంఖ్యను బట్టి వేర్వేరు జాతుల రొయ్యలను గుర్తించ వచ్చు. ఏటి రొయ్య రోష్ట్రం పొడవుగా నుండి పై అంచున 9-11 కంటకాలను కలిగి ఉంటుంది. నీలకంఠ రొయ్య రోష్ట్రం పొడవుగా నుండి మధ్య లో పెద్ద వొంపును కలిగి ఉంటుంది. ఇది పై అంచున 11 - 14 కంటకాలను కలిగి ఉంటుంది. తేలు రొయ్య రోష్ట్రం పొట్టిగా వుండి పై అంచున 13 వరకు కంటకాలను కలిగి వుంటుంది.
గోంగూర రొయ్య రోష్ట్రం పొడవుగా వున్నా 5 - 7 కంటకాలను మాత్రమే కలిగి వుంటుంది. రొయ్య విత్తనాన్ని చెరువులోకి వదిలే ముందు నేరుగా కాకుండా స్థానిక జలాలకు క్రమంగా అలవాటు చేసి వదలాలి. చురుకుగా ఆరోగ్యంగా వున్నా వాటిని మాత్రమే ఎన్నుకోవాలి. రొయ్య సర్వభక్షకి, చెరువులో లభ్యమయ్యే జంతు, వృక్ష సంబంధమయిన ఆహార పదార్దాలను తింటుంది. విడుదల చేసిన తరువాత 4 నుండి 6 నెలల్లో రొయ్యలు మార్కెట్ సైజుకి పెరుగుతాయి. మిశ్రమ పెంపకంలో చేపలకు ఇచ్చే ఆహారాన్ని రొయ్యలకు కూడా కొంత పరిమాణంలో పెంచి ఇవ్వవచ్చు.
చెరువు యాజమాన్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
- చెరువులో ఎల్లప్పుడు తగినంత లోతు నీరు ఉండేటట్లు చూడాలి.
- చెరువులో పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.
- చెరువులో ఆకుపచ్చ లేక ముదురు గోధుమ రంగు లేక ఇటుక రంగు, ఆల్గాల్ బ్లూమ్స్ ఏర్పడినప్పుడు ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.
- చెరువు నీటిలో కరిగి వున్నా ప్రాణ వాయువు తగ్గి పోవడమనేది సాధారణంగా ఏర్పడే ప్రమాదకరమైన పరిస్తితి. ఇందువలన చేపలన్నీ ఒకేసారి చనిపోయే ప్రమాదం వుంది. ముఖ్యంగా వేసవి కాలం తెల్లవారుజామున, లేక వర్ష కాలంలో మబ్బులు పట్టిన రోజుల్లోనూ కరిగివున్నా ప్రాణ వాయువు శాతం చాల తక్కువ స్థాయికి పడిపోతుంది. ఈ సమయంలో చేపలన్నీ నీటి ఉపరితలానికి వచ్చి నోటితో గాలి పీల్చుకుంటాయి. ఈ పరిస్థితుల్లో అనుబంధాహారాన్ని ఇవ్వడం, ఎరువుల వాడకం తాత్కాలికంగా నిలిపి వేయాలి. వీలుంటే కొంత నీరు తీసివేసి క్రొత్త నీరు పెట్టాలి. అటువంటి అవకాశం లేకపోతె చెరువులోని నీటిని మళ్ళి చేరువులోకే పంపు చేయాలి. వాసాలతో నీటిని బడటం ద్వారా అలజడి చేయాలి. ఎకరానికి 80 కిలోల చొప్పున సున్నం చల్లాలి.
- చేపలను తినే పక్షులు, తాబేళ్లు, పాములు, నిటి పిల్లులు, ఇతర మంసాహరులను వీలైనంత వరకు చెరువు నుండి తొలగించాలి.
- చెరువులో దొంగతనం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి.
|
|
|
విత్తనాన్ని నిల్వ చేసే విధానం
మిశ్రమ పెంపకంలో చేప తో పాటు రొయ్యలను పెంచుతున్నప్పుడు మోసు (మైల ) మరియు బంగారు తీగ చేపలను చెరువులోకి వదల రాదు . ఎందుకంటే ఇవి రొయ్యల వలెనే చెరువు అడుగు భాగంలో నివసిస్తాయి. అన్ని రకాల ఆహార పదార్దాలను తింటాయి. కాబట్టి స్థలం కోసం, ఆహారం కోసం ఇవి రొయ్యలతో పోటి పడతాయి. ఫింగర్ లింగ్ పరిమాణంలో నున్న చేప పిల్లలను ఎకరానికి 80౦ నుండి 15౦౦ వరకు స్టాక్ చేయవచ్చు. బొచ్చే మరియు రాగండి(శిలావతి) రెండు రాకలనే స్టాక్ చేస్తున్నప్పుడు బొచ్చె, రాగండి 4:6 నిష్పత్తిలో పెంచవచ్చు. రొయ్య విత్తనాన్ని ఎకరానికి 12,౦౦౦ వరకు చెరువులో వదలవచ్చు. రొయ్యలను పెంచకుండా ౩ రకాల చేపలనే పెంచుతున్నప్పుడు చేప పిల్లలను ఎకరానికి 100౦ నుండి 200౦ వరకు విడుదల చెయ్యవచ్చు. బొచ్చే : రాగడి : మోసులను ౩:5:2 నిష్పత్తి లో గాని, 2:5:౩ నిష్పత్తిలో కాని విడుదల చేయవచ్చు. చెరువులో క్రిత్రం పంటలలో ఈ ౩ జాతుల చేపల దిగుబడిని బట్టి వీటి నిష్పత్తిని నిర్ణయించవచ్చు. చెరువులో కలుపు మొక్కలున్నప్పుడు పరిమిత సంఖ్యలో ఎకరానికి 10౦-15౦ గడ్డి చేపలను వదలవచ్చు.
సున్నం - ఎరువుల వాడకం:
చేపల పెంపకంలో సున్నం వాడకం తప్పనిసరి. దీనితో అనేక లభాలున్నాయి. సున్నం వాడవలసిన పరిమాణం నేల పీ.హెచ్. (ఉదజని సూచిక) విలువపై ఆధారపడి యుంటుంది. ఉదజని సూచిక విలువ తగ్గినా కొలది వాడవలసిన సున్నం పరిమాణం పెరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో రాతి సున్నం 15౦ కిలోల ఎకరానికి సంవత్సరానికి నెలసరి వాయిదాల్లో వాడతారు. శీఘ్ర చర్య అవసరమయినపుడు “క్విక్ లైం” (కాల్చిన సున్నం) వాడవచ్చు. |
 |
చెరువు మట్టిని, నీటిని ఫలవంతం చేసి అధిక పరిమాణంలో చేపల సహజ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం సేంద్రియ, రసాయనిక ఎరువుల వాడకం ముఖ్యద్దేశం. పశువుల ఎరువు, సాధారణంగా వాడే సేంద్రియ ఎరువులు, యూరియా, సూపర్ ఫాస్పేట్, మ్యూరేట్ అఫ్ ఫోటాష్ లు సాధారణంగా వాడే రసాయనక ఎరువులు, ఎకరానికి సంవత్సరానికి కోళ్ళ ఎరువు 6,౦౦౦ కిలోలు, పశువుల ఎరువు 12,౦౦౦ నుండి 15,౦౦౦ కిలోలు, సమన నెలసరి వాయిదాల్లో వాడవచ్చు. ఆలాగే ఎకరానికి సంవత్సరానికి యూరియా 100 కిలోలు, సూపర్ ఫాస్పేట్ 25౦ కిలోలు, ఫోటాస్ 40 కిలోలు నెలసరి వాయిదాల్లో వాడవచ్చు. సేంద్రియ, రసాయనిక ఎరువులను 15 రోజుల వ్యవధిలో ఒకదాని తరువాత మరొకటి వాడాలి. |
|
అనుబంధాహారం, పోషకాహారం
చేపల పెంపకంలో ‘అనుబంధాహారం’ వాడటం ఒక ముఖ్యమయిన అంశం, పెంపకానికయ్యే ఖర్చు సుమారు 6౦ - 70 శాతం అనుబంధాహారానికి అవుతుంది. అధిక సాంద్రతలో చేపలను పెంచడం వలన చెరువులో ఉత్పత్తి అవుతున్న సహజ ఆహరం సరిపోదు. అందువలన చేపలు త్వరగా పెరిగి అధికోత్పత్తి సాధించడానికి అదనంగా అనుబంధాహారాన్ని ఇవ్వడం చాల ముఖ్యం. సమపాళ్ళలో తౌడు , పత్తి చెక్క, పొద్దు తిరుగుడు చెక్క మొదలగు వానిని కూడా అనుబంధాహారంగా ఇవ్వవచ్చు. చెరువులో చేపలను విదుదల చేసిన రెండవ రోజు నుండి మొత్తం చేపల బరువులో ౩ నుండి 5 శాతం అనుబంధహారాన్ని ప్రతి రోజు ఇవ్వాలి. చేపలు రోజు తీసుకునే ఆహారాన్ని బట్టి ఇవ్వాల్సిన అనుబంధాహారపు పరిమాణాన్ని సరిచేయవచ్చు. నర్సరీ, రేరింగు చెరువుల్లో అనుబంధాహారానని వెదజల్లడం ద్వారాను, స్టాకింగ్ చెరువుల్లో రంద్రాలు చేసిన సంచుల లోను ఇవ్వవచ్చు. అనుబంధాహారాన్ని ప్రతి రోజు ఉదయం ఇవ్వడం మంచిది. |
 |
 |
ట్రయిల్ నెట్టింగ్
ట్రయిల్ నెట్టింగ్ వేసి చేపల పెరుగుదలను, ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. చేపల సగటు పెరుగుదలను అంచనావేసి అందుకు తగ్గట్టుగా అనుబంధాహారం పరిమాణాన్ని పెంచాలి. వ్యాధులు, పరాన్న జీవులు ఏమయినా ఉన్నట్లయితే అందుకు తగిన నివారణ, చికిత్స చర్యలను తీసుకోవాలి. |
|
|
వ్యాదులు - నివారణ:
చేపలకు వైరస్, బాక్టీరియా, ఫంగస్, ప్రోటోజొవాన్, ప్లాటి హేల్మింద్, క్రస్టేషియన్ వ్యాధులే కాక, ఫోషక పదార్దాల లోపం వలన, వాతావరణంలో మార్పుల వలన కూడా అనేక వ్యాధులు వస్తాయి. మన రాష్ట్రంలోని చేపలకు సాధారణంగా ఈ క్రింద తెలిపిన వ్యాధులు వస్తున్నాయి.
బాక్టీరియా : హేమర్రెజిక్ సేప్టిసిమియా
ప్రోటోజోవన్ : మిక్సోబోలాస్ , ఇక్తియోప్తిరియాస్, ట్రైఖో డైనా
ప్లాటి హెల్మింద్: డా క్టేలో గైరస్ (గిల్ ప్లూక్), గైరోక్ట్ లస్ (బాడి ప్లూక్)
క్రస్టేషియన్: ఆర్య్గు లస్ , లేర్నియ |
ఈ వ్యాధులు రాకుండా ఉండటానికి పరాన్న జీవులు లేని, కలుషితం కాని స్వచ్చమైన నీటిని మాత్రమే చెరువుల లోనికి తోడాలి. దీనికి తోడు చెరువు పరిశుభ్రతను పాటించినట్లయితే చాల వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ఇందుకు క్రమం తప్పకుండా సున్నం వాడటం అవసరం. బాక్టీరియా వ్యాధులను ఆహారంలో యంటిబయోటిక్ మందులు వాడటం ద్వారాను, ప్రోతోజోవాన్ వ్యాధులను సాధారణ ఉప్పు వాడటం ద్వారాను, ప్లాటి హేల్మిందు మరియు క్రస్టేషియన్ వ్యాధులను నువాన్ (అర్గోనోఫాస్పేట్ క్రిమసంహారిక మందును) పిచికారి చేయడం ద్వారా చికిత్స చేయవచ్చు. |
 |
|
|
|
| |
 |
చేపలు పట్టడం
చేపలను ఏ సైజుకు పెంచి అమ్మాలి అనేది మార్కెట్ డిమాండ్ పై ఆధారపడి వుంటుంది. సాధారణ స్టాకింగ్ పద్దతిలో కిలో సైజు పెరగడానికి 10 - 12 నెలలు పడుతుంది. ఇంకా పెద్ద సైజు చేపలకు మార్కెట్ డిమాండ్ వుంటే సాంద్రత తగ్గించాలి. చేపల పట్టుబడి పూర్తిగా గాని పాక్షికముగా కాని చేయవచ్చు. మార్కెట్ సైజుకు ఎదిగిన చేపలను ఎప్పటికప్పుడు పట్టి వేయడాన్ని పాక్షికంగా పట్టడం అంటారు. పెద్ద చేపలను తీసివేసిన తరువాత చెరువులోకి చిన్న సైజు చేపలు త్వరితగతిన పెరుగుతాయి. |
 |
చేపల పట్టుబడికి సాధారణంగా లాగుడు వలలను ఉపయోగిస్తారు. మామూలుగా చేపలను ఉదయం సమయంలో పడతారు. నీటిని చాల వరకు తోడి వేస్తారు. రొయ్యలను పెంచుతున్నప్పుడు నీటిని పూర్తిగా తీసివేసిన తరువాత మాత్రమే రొయ్యలు పట్టడం సాధ్యమవుతుంది. వలను చెరువులో లోతయిన ప్రాంతం నుండి ప్రారంభించి లోతు తక్కువ ప్రాంతం వైపు లాగుతారు. ట్రెంచ్ పద్దతిలో చెరువు నిర్మించినపుడు నీరు తోడివేసినపుడు చెరువులోని చేపలన్నీ ట్రెంచ్ లోనికి చేరడం వలన పట్టుబడి తేలిక అవుతుంది. |
 |
చేపలను నిలువ చేయడం, రవాణా చేయు విధానం
చేపలను నీటిలో నుండి తీసిన తరువాత అతి త్వరగా చెడిపోతాయి. కాబట్టి పట్టుబడి అయిన వెంటనే చేపలను స్వచ్చమైన నీటిలో కడిగి ప్యాక్ చేయాలి. దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి చేపలను ఐస్ తో ప్యాక్ చేయాలి. వెదురు బద్దలతో అల్లిన పెద్ద బుట్టలతో చేపలను, పొడిచేసిన ఐస్ ను ఒక దానిపై ఒకటి పొరలుగా పేర్చి బుట్ట మూతిని కప్పి తాడుతో కట్టివేస్తారు. ఈ పద్దతిలో చేపలను తాజాగా 48 గంటల వరకు రవాణా చేయవచ్చు. ఇంకా దూర ప్రాంతాలకు రవాణా చేయాలంటే మధ్యలో తిరిగి ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని చేపల రైతులు కలకత్తాకు చేపలను రవాణా చేయడానికి “ఇన్సులేటెడ్ వ్యానులను” ఉపయోగిస్తున్నారు.
చేపలను తాజాగా నిల్వ చేయడం:
చేపలు త్వరగా చెడిపోవుటకు గల ముఖ్య కారణాలు- చేప శరీరంలో ఉండే జీర్ణ గ్రంధులు, సూక్ష్మ జీవులు మరియు వాటి చర్యల ద్వారా ఉత్పత్తి అయ్యే రసాయనిక పదార్దాలు, ఈ చర్య చేప ఉష్ణోగ్రత పైన ఆధారపడి వుంటుంది. కావున చేపలు పట్టిన తరువాత, వాటి ఉష్ణోగ్రతను ౦’ డిగ్రీల సెల్సియస్ కు తగ్గించి వుంచినచొ ఎక్కువ సేపు, తాజాగానిల్వ చేయ వచ్చు. దీనితో పాటు, బాక్టీరియా అధికంగా వుండే చేప మొప్పులు, పొలుసులు, ప్రేవులు, తల భాగాలను తొలగించి చల్లని మంచి నీటితో శుభ్రపరచి ఐస్ తో ప్యాక్ చేసి ఉంచినచో చేపలను తాజాా, ాగ |
 |
సహజ రుచిని కోల్పోకుండా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. మంది నిటి చపల పొలుసులు, మొప్పలు, ప్రేవులు మరియు తల చేప శరీరం నుండి వేరు చేయుటకు ఆధునిక యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందు కొరకు ఆచార్య యన్.జి. రంగ విశ్వవిద్యాలయం ద్వారా చేపల విక్రయ బల్ల తయరుచేయబడింది. దీని సహించే తక్కువ శ్రమతో పరిశుబ్రమైన వాతావరణంలో శాస్తియంగా డ్రస్సింగ్/శుభ్రం చేసి నాణ్యమైన చేపలను విక్రయించవచ్చు. దీని ధర రూ. ౩,95౦ /- |
| |
 |
|
విలువ కలిగిన ఉత్పత్తుల తయారి
- ఫిష్ స్టిక్స్ (చేప ముక్కలు) :
చేపలను శుభ్ర పరచిన తరువాత (పొలుసులు, మొప్పలు, ప్రేవులు మరియు తల, చేప శరీరం నుండి వేరు చేసినవి) వండుతకు వీలైనంత అంటే సుమారు ఒక అంగుళం నుండి అంగుళం నుండి అంగుళంన్నర సైజులలో పలుచటి ముక్కలుగా కోసి ప్రత్యేకమైన ప్లాస్టిక్ సంచుల్లో ¼ కిలో,1/2 కిలో, 1 కిలో నుంచి 2 కిలోల పరిమాణాల్లో నింపి సీలు చేసిన తరువాత వీటిని, ఐస్ గడ్డలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, సూదుల్లాంటి మొనలు లేకుండా చేసి వాడుకోవాలి, లేనిచో ప్లాస్టిక్ సంచులకు రంద్రాలు ఏర్పడి, ఐస్ కరిగిన నీళ్ళు సంచి లోపలకు పోయి చేప ముక్కలను పాడు చేస్తాయి. కావున ప్లెకేడ్ ఐస్ ఉపయోగించినచో మంచిది. ఈ విధంగా ప్యాక్ చేసిన వాటిని ప్లాస్టిక్ తొట్లలో అమర్చి రవాణా చేయునప్పుడు, ప్రతి వరుసకు ఐస్ వేసి ప్లాస్టిక్ సంచులను వుంచినచో, చేప ఉష్ణోగ్రత తక్కువగా వుండి ఎక్కువ కాలం నాణ్యత కలిగి వుంటుంది. |
| ఫిష్ ఫిలేట్స్ (చేప ఫిలేట్స్):
శుభ్ర పరచిన చేపల శరీర మధ్య భాగంలో వుండే వెన్నెముక ముళ్ళను తొలగించిన తరువాత రెండు పొడవైన ముక్కలను చేప ఫిలేట్స్ అంటారు. వీటిని కూడా ప్లాస్టిక్ సంచుల్లో ముందు చెప్పిన విధంగా తగు పరిమాణంలో ప్యాకింగ్ చేసి మార్కెట్ చేయవచ్చు. ప్రసుతం మన రాష్ట్రంలో రెండు ప్రాసెసింగ్ ప్లాంట్స్ , మంచి నీటి చేపలకు ఈ విధంగా విలువను పెంచి, శితలికరణ పద్ధతి ద్వారా 4-6 నెలల వరకు నిల్వ వుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. |
 |
|
 |
ఫిష్ మిన్స్ (చేప కైమా):
శాస్త్రీయంగా శుభ్రపరచిన చేపల నుండి పూర్తిగా ముళ్ళు మరియు చర్మాన్ని ఆధునిక యంత్రాల సహాయంతో వేరు చేసిన తరువాత లభ్యమయ్యే చేప మాంసాన్ని చేప కైమా అంటారు. దీనిని కూడా కావలసిన పరిమాణాల్లో ప్లాస్టిక్ సంచుల్లో నింపి తక్కువ ఉష్ణోగ్రతలో (-18 డిగ్రీల సెల్సియస్) వుంచి అమ్మవచ్చు. చేప కైమాతో చేప కట్ లెట్స్, చేప సాసేజ్లు, చేప రింగ్స్, చేప బాల్స్ మొదలగునవి చేసి, అప్పటికప్పుడు తినే పదార్ధాలను తాయారు చేసి అమ్మవచ్చు. ఈ చేప కైమా లో ముళ్ళు లేకపోవడం వలన చాల మంది ఇష్టపడతారు.
చేప కైమా ఎక్కువ రోజులు నిలువ ఉండేందుకు ఒక శాతం ఉప్పు గాని, పంచదార గాని కలిపి శీతలికరణ వాతావరణం లో ఉంచిన 4- 6 నెలల వరకు తాజాగా వుండి , వినియోగదారులకు అన్ని కాలాల్లో అందించవచ్చు. ఉప్పు లేక పంచదార కలిపినా చేప కైమాను ‘సురిమీ’ అంటారు. సురిమిని జపాను, కొరియా మరియు ఇతర ఐరోపా దేశ ప్రజలు విపరీతంగా ఇష్టపడతారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో మంచి నీటి చేపల నుంచి సురీమిని తయారు చేయాడానికి కొన్ని పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. |
|
|
|
|
 |